telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఓటుకు నోటు కేసులో.. చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం .. : రేవంత్ రెడ్డి

Congress Revanth Comments TRS

గత రెండు రోజులుగా ఈడీ ముందు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈడీ అధికారులు అడిగిందే అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తనపై ఐటీ అధికారులు పెట్టిన కేసులపై ఈడీ అధికారులు ఆరా తీశారని అన్నింటికి సమాధానం చెప్పానని తెలిపారు.

ఓటుకు నోటు కేసుకు సంబంధించి గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు క్లీన్ చీట్ ఇచ్చినా ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఈ కేసులో ఆరోపణలను రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎలాగైనా కేసులో తనను, సీఎం చంద్రబాబు నాయుడును ఇరికించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే ఓటుకు నోటు కేసులో రెండు రోజులపాటు రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.

అంతకు ముందు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని, అతని తనయులను కూడా ఈడీ అధికారులు విచారించారు. వేం నరేందర్ రెడ్డి సైతం కేసులో ఇరికిచేందుకు కుట్ర జరుగుతోందని, కేంద్రం డైరెక్షన్ లో విచారణ జరుగుతుందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు.

Related posts