నిన్న ఐపీఎల్ 2020 లో బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్‌కతా జట్టు పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని దారుణంగా విఫలమైంది. పవర్ ప్లే లోనే కేవలం 14 పరుగులకు 4 వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్లు ఎవరిని నిలదొక్కుకోనివ్వలేదు. కెప్టెన్ మోర్గాన్ 30 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు చేసింది. ఇక 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన బెంగళూరు ఎక్కడ తొందరపడకుండా నిదానంగా ఆడి 13.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది.
పవర్‌ప్లేలో అత్యంత పేలవంగా ఆడిన కేకేఆర్ ఇప్పటివరకు మొదటి ఆరు ఓవర్లలో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. మొదటి ఆరు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. కోల్‌కతాకు ఇది ఆల్‌టైం చెత్త రికార్డు ఇది. 2009లో హైదరాబాద్-21/3, 2010లో చెన్నై-22/4, 2014లో పంజాబ్-24/3 పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి.
ఇక ఐపీఎల్ అన్ని ఓవర్లూ ఆడి.. అత్యల్ప స్కోరు చేసిన కట్టుకూడా ఇదే… బెంగళూరు మీద 8 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేసింది. గతంలో 2009 సీజన్‌లో పంజాబ్ జట్టు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక నాపై కేసులు: జగన్