telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టర్కీలో భారీ భూకంపం … 18 మృతి..

huge earth quake in turkey

టర్కీ(తూర్పు)లో భూకంపం సంభవించింది, రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భూ ప్రకపంనాలతో భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద చాలా మంది ఇరుక్కుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు రంగంలోకి దిగారు. భూకంప కేంద్రం సిర్విస్‌గా గుర్తించారు. ఈ పట్టణం సరస్సు పక్కన ఉంటుంది. భూకంపంతో 18 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరో 30 మంది ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. వారు శిథిలాల కింద ఉంటారని అంచనా వేస్తున్నారు. భూ ప్రకంపనాలతో భయకంపితులకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రకంపనాలతో ఫర్నిచర్ తమపై పడబోతుండగా బయటకు పరుగెత్తామని ప్రత్యక్షసాక్షి మెలహట్ కాన్ పేర్కొన్నారు. ఇతను ఎలాజీ నగరంలో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. భూకంపంతో బయటకొచ్చిన ప్రజలు.. చలి నుంచి రక్షణ పొందేందుకు బయట చలికి కాచుకుంటు ఉంటున్నారు.

భూకంప సహాయ కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమలు కొనసాగుతోన్నాయని అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టర్కీ కాలమానం ప్రకారం 8.55 గంటలకు సిర్విస్‌లో భూమి కంపించిందని టర్కీ విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్నది. మరోవైపు భూకంపంతో ప్రజలు ఎలా భయాందోళనకు గురవుతున్నారో టర్కీ మీడియా విజువల్స్‌లో చూపించింది. కొందరిని ఆస్పత్రికి తీసుకెళ్లే ఫుటేజీ భయాందోళన కలిగిస్తోంది. మరో వీడియోలో ఇంటిపైగల రూప్ కాలిపోతూ కనిపించింది. చనిపోయిన మృతుల వివరాలను టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. 18 మందిలో 13 మంది ఎలాజీకు చెందినవారని.. ఐదుగురు మలత్యాకు చెందినవారని పేర్కొన్నారు. భూప్రకంపనాలతో 533 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.

Related posts