ఏపీలోని పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అందించే అన్న క్యాంటీన్ పేరు మారిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ పథకానికి వైసీపీ ప్రభుత్వం పేరు మార్చింది. ఇక నుంచి అన్న క్యాంటిన్లు రాజన్న క్యాంటీన్ లుగా మారిపోయాయి.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్యాంటీన్ ల బిల్డింగులకు రంగులు మార్చాలని, కొత్త పేరును సూచించేలా బోర్డులు పెట్టాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్యాంటీన్ లకు వైట్ పెయింట్ వేసి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు కటౌట్ ఫొటోలను ఏర్పాటు చేశారు. రాజన్న క్యాంటీన్ అంటూ బోర్డులు పెట్టించారు.