telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పెళ్లి చేసుకున్న బుమ్రా.. ఎవరిని అంటే…?’

భారత బౌలర్ బుమ్రా ఈరోజు ఓ ఇంటివాడు అయిపోయాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌‌ని గోవాలో బుమ్రా వివాహం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో 20 మంది మాత్రమే అతిథులు ఈ వివాహానికి వచ్చారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టుతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడే అతడు వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది. కానీ ఎవరిని విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజాగా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాని బుమ్రా వివాహం చేసుకోబుతున్నట్లు వార్తలు రాగ ఇప్పుడు అది నిజమని తెలిసింది. వివాహం తర్వాత జస్ప్రీత్ బుమ్రా.. క్రీడా ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

Related posts