బీహార్ లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 97 మంది చిన్నారులు మరణించారు. ఒక్క ముజఫర్ పూర్ లోనే మృతుల సంఖ్య 84గా ఉంది. వైశాలీ ఆసుపత్రిలో 10 మంది, మోతిహారీ ఆసుపత్రిలో ఒకరు, బెగూసరాయ్ ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారని అధికారులు వెల్లడించారు.
కాగా, శుక్రవారం నాడు 57గా ఉన్న మృతుల సంఖ్య 24 గంటల్లోనే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీహార్ ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రాణనష్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.