telugu navyamedia
క్రీడలు వార్తలు

ద్రావిడ్ ను ఎప్పుడైనా ఇలా చూసారా…?

రాహుల్‌ ద్రవిడ్‌.. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో అందరికి తెలుసు. భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి.. శాంతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టుగా వ్యవహరించాడు. కామ్‌గా ఉంటూ వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిలిచి టీమ్‌ను ఎన్నోసార్లు గ‌ట్టెక్కించిన చ‌రిత్ర ద్ర‌విడ్ సొంతం. రాహుల్‌ ద్రవిడ్‌కు ఇతరులపై అరిచేంతలా కోపం తెప్పించిన ఘటన ఏమీ లేదు. అయితే ఓ యాడ్ ‌(CRED) కోసం ద్రవిడ్‌ యాక్టింగ్‌ చేశాడు. అందులో కోపంతో ఊగిపోతూ కనిపించే ద్రవిడ్‌.. ఇతరులపై గట్టిగా అరుస్తూ, బ్యాట్‌తో కారు సైడ్ మిర్రర్ పగలగొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా.. ‘నేను ఇందిరానగర్‌ గూండా’ను అంటూ హల్‌చల్‌ చేస్తాడు. అయితే ఈ యాడ్ వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట‌ర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది. రాహుల్ భాయ్‌ను ఇంత‌కు ముందెప్పుడూ ఇలా చూడ‌లేద‌ని కోహ్లీ కామెంట్ చేశాడు.

Related posts