telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి మరో షాక్ .. వైసీపీలో చేరిన అంబికా రాజా!

ycp party

ఏపీ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు బేజీపీ, వైసీపీ లో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత, అంబికా రాజా ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమగోదావరిలోని ఏలూరు వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అంబికా నాని రాజాకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ప్రజలకు సాయం చేశారని ప్రశంసించారు. వైసీపీలో చేరిన ఆయన సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మొన్న యూరప్ పర్యటనలో ఉన్నపుడు అంబికా రాజా సోదరుడు అంబికా కృష్ణ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి విధితమే.

Related posts