టీడీపీ అధినేత చంద్రబాబు మార్షల్ ను దుర్భాషలాడారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుపై వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను చంద్రబాబునాయుడు ఖండించారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీఫ్ మార్షల్ ను తాను దుర్భాషలాడినట్టు ఎవిడెన్స్ లేదని అన్నారు.
ఆధారం లేని దానికి కూడా కొంత మంది ఉద్యోగస్తుల నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సభలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ కు అనుభవం లేదు కానీ గర్వం ఉందని, ఒళ్లంతా కొవ్వు కూడా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం ఒక ఆంబోతు మాదిరి ఎగిరెగిరి పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గ్రామ వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రజని