ఉద్యోగం ఇప్పిస్తా అని ఓ మహిళను వేధించిన గుంటూరు జిల్లా అటవీశాఖాధికారి డీఎఫ్‌వో మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారం పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులను అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నివేదిక రాగానే డీఎఫ్‌వోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు.
అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్‌రావు ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు, ఉద్యోగమూ లేదని చెప్పడంతో బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని సదరు అధికారిని బదిలీ చేయాలంటూ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.
సీఎం జగన్ అసత్యాలతో తమకు సవాల్ విసురుతున్నారు: చంద్రబాబు