telugu navyamedia
క్రీడలు వార్తలు

విలియమ్సన్ పై భారత అభిమానులు జోకులు…

కేన్ విలియమ్సన్ ఇచ్చిన టైటిల్ ఫోజ్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఈ ఫొటోలో ఇరు జట్ల కెప్టెన్‌లు చెరొపక్క నిలబడగా.. మధ్యలో డబ్ల్యూటీసీ టైటిల్ గదను ఉంచారు. అయితే ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ దుస్తులు తెల్లగా మెరిసిపోతుంటే.. కేన్ విలియమ్సన్ డ్రెస్ మాత్రం మాసిపోయినట్లు ఉంది. దీన్నే టార్గెట్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఓ డిటెర్జంట్ యాడ్‌గా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. డిటర్జెంట్ సబ్బులు, సర్ఫులకు ఉపయోగించే యాడ్ డైలాగ్స్‌ను ఈ ఫొటోలకు క్యాప్షన్‌‌గా పేర్కొంటూ ఫన్నీమీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘హే కేన్ నీ సబ్బు స్లోనా? అని ఒకరంటే.. న్యూజిలాండ్‌లో టైడ్ సబ్బు లేదా?’అని మరొకరు ప్రశ్నించారు. ‘ఇదైతే డిటర్జెంట్ యాడ్ కాదు కదా? అసలు కోహ్లీ ఏ డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నాడో? అతని బట్టలు తెల్లగా మెరిసిపోతున్నాయి’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకొకరేమో టైడ్ యాడ్‌లా ఉందని, న్యూజిలాండ్ ప్లేయర్లకు టైడ్, సర్ఫక్సెల్, ఏరియల్, ఘడీ డిటర్జంట్ ఫౌడర్లు ఇవ్వాలని సెటైర్లు పేల్చుతున్నారు.

Related posts