ఏపీ రాజధాని అమరావతిపై అపోహలు సృష్టించొద్దని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అపోహలు సృష్టించి ఎడారి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపైమండిపడ్డారు. రాజధాని ఏర్పాటు, సెక్రటేరియట్ ఏర్పాటు, ఉద్యోగుల తరలింపు , హైకోర్టు వంటి అంశాలన్నీ కూడా నిర్ణయమైపోయాయని అన్నారు.
అభద్రతాభావంతో కూడిన అంశాలను సృష్టించి, పరిష్కారం కోసం వెదుక్కోవడం సరైనటువంటి ప్రక్రియ కాదని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడైనా సమస్యలను పరిష్కరించుకుంటారు కానీ వాటిని సృష్టించరని అన్నారు. జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందనివిమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.