ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. గురువారం రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నైతోపాటు ఆ జట్టు కెప్టెన్ ధోనీ ఖాతాలోనూ అరుదైన రికార్డు వచ్చి చేరింది.
రాజస్థాన్‌పై విజయం తో చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.
జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు