telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాస్‌ స్టెప్‌లతో అదరగొట్టిన ప్రగతి… వైరల్ అవుతున్న వీడియో

pragati

లాక్ డౌన్ కారణంగాసెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో తోచిన పని చేసుకుంటూ దానికి సంబందించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి ఓ డ్యాన్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఓ తమిళ మాస్ పాటకు ప్రగతి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కేక పెట్టించేసింది. తమిళ స్టార్ విజయ్ తాజా సినిమా మాస్టర్ లోని ఓ మాస్ పాటకు లుంగీ కట్టి మాస్‌ డ్యాన్స్‌ చేస్తూ ఊపేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నటి ప్రగతి తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

 

View this post on Instagram

 

Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩

A post shared by Mahavadi Pragathi (@pragstrong) on

Related posts