telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భారతీయుడు-2″లో కాజల్ పాత్ర ఇదే ?

Kajal

ప్రముఖ దర్శకుడు శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “భార‌తీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కాగా… రీసెంట్‌గా క‌మ‌ల్ హాస‌న్ లుక్‌కి సంబంధించి ప‌లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. భోపాల్‌లో హై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. పీట‌ర్ హెయిన్ సారథ్యంలో రూపొందుతున్న సీన్స్ హాలీవుడ్ లెవ‌ల్‌లో ఉంటాయ‌ని అంటున్నారు. చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఆమె 85 ఏళ్ళ ముస‌లావిడ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇది కాజ‌ల్‌కి ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ చిత్రంలో 90 ఏళ్ళ వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియ‌న్ 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

Related posts