సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కాలేయ సంబాధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయనకు ఈ చికిత్స జరిగింది.
నిన్న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదే సమయంలో అశోక్ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్ చేశారు. నిన్న సాయంత్రం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
అతియా స్విమ్ సూట్ మిర్రర్ సెల్ఫీ పై కేఎల్ రాహుల్ కామెంట్… !