telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాలో మరో తారక్… ఫోటోలు వైరల్

NTR's-Dupe

సాధారణంగా కొన్ని రిస్కీ ఫైట్లను హీరో డూప్ లతో చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే స్టార్లను పోలిన మనుషులు ఎక్కడున్నా వాళ్ళ ఫొటోలతో సహా ఆ వీడియో వైరల్ అవుతోంది. తాజాగా శమీందర్ సింగ్ అనే పంజాబీ యువకుడు ట్విట్టర్‌లో తన ఫోటోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్నాడు. ఇతను చూడగానే తారక్ లాగే కనిపిస్తున్నాడు… అంతేకాదు ఈ సర్ధార్ జీ యంగ్ టైగర్‌కి పెద్ద ఫ్యాన్ కూడా. సోషల్ మీడియాలో అదే చెబూతూ తనకు ఓ సారి అభిమాన హీరోని కలవాలని ఉందంటూ కోరిక వెలిబుచ్చుతున్నాడు. ఇంత వరకూ మన నందమూరి స్టారైతే స్పందించలేదు కానీ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం… ఈ మరో తారక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి తారక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts