telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. ప్రారంభమైన ప్రభుత్వ మద్యం దుకాణాలు.. మందుబాబులకు అవస్తలే..

new alcohol shops open in AP

రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధానికి మొదటి అడుగు పడింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను ప్రారంభించగా, అనంతపురం జిల్లా, పెనుకొండ డివిజన్లలో 25 షాపులు మొదలయ్యాయి. ప్రభుత్వ దుకాణాల ఏర్పాటు మందుబాబులకు అవస్థలు తెచ్చి పెట్టింది. సరైన వసతులు, సిబ్బంది నియామకం లేకుండానే, దుకాణాలు మొదలు కావడంతో పోలీసులే దుకాణంలో కూర్చుని అమ్మకాలు చేపట్టారు. సేల్స్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఈ ఉద్యోగాలు తమవారికే ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. దీంతో ఏ నిర్ణయం తీసుకోలేని అధికారులు, ఎవరినీ నియమించక పోగా, రోజువారీ కూలీలనే పెట్టి, అమ్మకాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల రక్షణ నిమిత్తం పని చేయాల్సిన కానిస్టేబుళ్లు కూడా మద్యం దుకాణాల్లో కూర్చోవాల్సి వచ్చింది. మరో విషయం ఏంటంటే, డిమాండ్ కు సరిపడా మద్యాన్ని సరఫరా చేయడంలోనూ ఇబ్బందులు వచ్చాయి. సిబ్బంది లేకున్నా, సమస్యలు లేకుండా మద్యం సరఫరాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Related posts