telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆకాశవాణి న్యూస్‌ రీడర్‌ సత్యవతి మృతి: సీఎం కేసీఆర్ సంతాపం

madapatisatyavathi news reader

ఆకాశవాణి మాజీ న్యూస్‌ రీడర్‌ మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగనున్నట్లు వెల్లడించారు. సత్యవతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సీఎం కొనియాడారు.

మాడపాటి సత్యవతి హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావుకు మనువరాలు. నిజాం కాలం పరిపాలనలో జరిగిన అరాచకాలను చూశారు. తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే తన తాత హనుమంతరావు స్థాపించిన బాలికల తెలుగు ఉన్నత పాఠశాలలో సత్యవతి విద్యను అభ్యసించారు.

Related posts