telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాలినడకన రాష్ట్రపతి భవన్‌కు రాహుల్‌

soniya rahul

నేడు రాష్ట్రపతి భవన్ కు కాలినడకన రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేయనుంది. మూడు “నల్ల వ్యవసాయ” చట్టాలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ 28 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ తో సహా పలు పార్టీల మద్దతు లభించింది. గత వారం రాష్ట్రపతి ని కలిసి రైతుల డిమాండ్ పై జోక్యం చేసుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ తో పాటు, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు అందజేసారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మద్దతుగా దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలను సేకరించిన కాంగ్రెస్ పార్టీ… పార్లమెంట్ లో ఈ మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు కార్మికులు, దేశవ్యాప్తంగా ఇతర సంబంధిత వర్గాల నుంచి సంతకాలు సేకరించింది. పార్లమెంట్ భవనం దగ్గర లోని విజయచౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన వెళ్లి రాష్ట్రపతి కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ నేతల బృందం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని ఆరోపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా లతో పాటు, పలు ఇతర రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున “ట్రాక్టర్ యాత్ర” ను చేపట్టానే రాహుల్ గాంధీ. ఇప్పటివరకు కొనసాగుతున్న ఉద్యమంలో 44 మంది రైతులు మృతి చెందారు.

Related posts