telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైయస్సార్ చేయూత పథకానికి వారు కూడా అర్హులే!

Ysr cheyutha schme jagan

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు నాలుగు కులాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పలు కారణాల వల్ల కులధ్రువీకరణ పత్రాన్ని పొందడంలో వాల్మీకి, బుడగజంగం, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం లేకుండానే చేయూత పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించింది.

కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల పలువురు అర్హులు లబ్ధి పొందలేకపోయారనే విషయాన్ని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలువురు మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎంఓ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నాలుగు కులాల వారికి కులధ్రువీకరణ పత్రం లేకుండానే ఈ పథకం వర్తించనుంది.

Related posts