telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆక్టోపస్ చేతిలో చిక్కుకుపోయిన గద్ద… చివరకు…!

Eagle

కెనడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో నీటిలో ఉన్న ఆక్టోపస్‌ కోసం కిందకు వచ్చిన గద్దకు వింత అనుభవం ఎదురైంది. ఆక్టోపస్‌ను నోట కరచుకోబోయిన గద్ద.. రివర్స్‌లో ఆక్టోపస్ కబంద హస్తాలలో చిక్కుకుంది. దాని నుంచి విడిపించుకోలేక గద్ద కొద్దిసేపు విలవిలలాడింది. అదే సమయంలో అటువైపుగా చేపలు పట్టే సాల్మన్‌ బృందం పడవలో వెళ్తూ ఈ ఘటనను చూశారు. ఆక్టోపస్ కబంద హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గమనించారు. గద్దను కాపాడాలని భావించిన బృందం సభ్యులు ఒక కర్రతో ఆక్టోపస్‌ను కదిలించారు. కర్ర శరీరానికి తగలడంతో ఆక్టోపస్‌ తన పట్టు విడవడం.. అదే సమయంలో గద్ద దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియో యూట్యూబ్‌లో 1.78 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.

Video Source: Trending News Today

Related posts