telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హెచ్‌1బీ వీసాదారులకు కాస్త ఊరట!

Hib visa us

అమెరికాలో ఉద్యోగం కోసం పొందే హెచ్‌1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ కాస్త ఊరట కల్పించింది. హెచ్‌1బీ వీసాదారులు తమ పాత ఉద్యోగాన్ని కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇచ్చింది. హెచ్‌1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్‌ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకూ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హెచ్‌1బీ వీసాలపై నిషేధానికి ముందు ఏ ఉద్యోగం చేశారో, అదే ఉద్యోగంలో కొన‌సాగేందుకు అనుమ‌తి ఇస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ వీసాదారులపై ఆధార‌ప‌డేవాళ్లు, వారి జీవిత ‌భాగ‌స్వాములు, పిల్ల‌లు అగ్రరాజ్యం ప్ర‌యాణం చేసేందుకు అనుమ‌తి కల్పించారు. కరోనా వ్యాప్తి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ వీసాలతో ఉన్న విదేశీ టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్ల సేవలు ఎంతగానో అవ‌స‌రముందని అమెరికా పేర్కొంది.

Related posts