telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘క్యాలీఫ్లవర్’ తో వస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌

“హృదయ కాలేయం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమా “హృదయ కాలేయం”తో నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని కామెడీ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత “సింగం 123” సినిమాలో హీరోగా నటించాడు. అయితే హీరోగా కన్నా తాను ఒక మంచి కమెడియన్ గా తన సత్తా చూపించాలనుకొన్న సంపూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు.  ఇది ఇలా ఉండగా ఇవాళ సంపూర్ణేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త సినిమాను ప్రకటించింది మధుసూదన క్రియేషన్స్ సంస్థ. ‘క్యాలీఫ్లవర్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ బ్యాంగ్ ను వీడియో గా విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ ఇంగ్లీష్ మేన్ గా దర్శనం ఇవ్వటం విశేషం. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.కె మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. గూడురు శ్రీధర్ సమర్పకునిగా వ్యవహరించనున్నారు. వాసంతి హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. 

Related posts