దర్శకుడు పూరి జగన్నాధ్ కోసం ఒకప్పుడు టాప్ రేంజ్ టాలీవుడ్ స్టార్స్, ప్రొడ్యూసరస్ ఎదురు చూసేలా రేంజ్ మైంటైన్ చేసిన విషయం తెలిసిందే. ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎవరు సంపాదించనంత డబ్బు, క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రొడ్యూసర్స్, హీరో కాదు పూరీ పేరు చెబితే సినిమా బిజినేస్ అయిపోయేది. కానీ అదే పూరీ కొంత కాలంగా బ్యాడ్ టైం లో ఉన్నాడు. తన స్థాయి హిట్ లేక అభిమానులు కూడా పూరి ఎప్పుడు కం బ్యాక్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ టీజర్ పూరీ మార్క్ ను చూపించింది. కానీ ఆడియన్స్లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పూరి స్టైల్ హీరోయిజంతో పాటు రామ్ ని ఓ రేంజ్ మాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా రిజల్ట్ ను బట్టే పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇస్మార్ట్ శంకర్ విషయంలో పూరి ఎప్పటిలాగే తన స్టైల్ ని చూపించాడు. హీరో క్యారెక్టర్ విషయంలో ఇడియట్, పోకిరిల నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన పూరి ఐస్మార్ట్ శంకర్ లో అదే కనిపిస్తోంది. సరిగ్గా చూపించాలే కాని రొటీన్ అయినా డిఫరెంట్ గా ఉన్నా ప్రేక్షకులు కథతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోయి వసూళ్లు కురిపిస్తారు. పైసా వసూల్ కు పూరి ఈ ఫార్ములా సరిగ్గా వాడలేదు. ఐస్మార్ట్ శంకర్ కి ఇది సరిగ్గా కుదిరితే మాస్ అండతో హిట్టు కొట్టేయోచ్చు. తన స్టైల్ ని పక్కన పెట్టకపోయినా తనదైన టేకింగ్ తో శంకర్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే చాలు పూరి మళ్ళి ట్రాక్ లో పడ్డట్టే.