ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా 23న కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా 24న రాయచోటిలో పర్యటించనున్నారు. 25న పులివెందులలో వైద్య కళాశాలతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 24, 25 తేదీల్లో ఇడుపులపాయ, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలసి జగన్ ప్రార్థనలను నిర్వహించనున్నారు.