telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిరిసిల్లలో కేటీఆర్‌ కు షాక్ ..10 వార్డుల్లో రెబల్స్ విజయం

ktr trs

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడింది. మెజర్టీ స్థానాలను కైవసం చేసుకుంటూ ప్రత్యర్థులకు చుక్కలుచూపించింది. అయితే కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికర ఫలితాలు వెలువడ్డాయి. మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మాత్రం స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది.

సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ సత్తా చాటలేకపోయారు. సిరిసిల్ల మున్పిపాలిటీకి సంబంధించి 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తికాగా… అందులో టీఆర్ఎస్ 24 వార్డులు, బీజేపీ 3, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలిచాయి. 10 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ను బుజ్జగించేందుకు ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా వారు మాట వినలేదు. రెబల్స్ గా గెలిచినా వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవడం ఉండదని గతంలోనే కేటీఆర్ హెచ్చరించారు.

Related posts