ఇటీవలే టర్కీలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి. వందలాదిమంది శిధిలాల కింద చిక్కుకున్నారు. దాదాపుగా 45 మందికి పైగా మరణించారు. అయితే, శిధిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఓ అద్భుతం జరిగింది. నాలుగు రోజుల క్రితం భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవనం శిధిలాల కింద ఓ చిన్నారి గొంతు వినిపించింది. వెంటనే శిధిలాలను చిన్నారి కనిపించింది. నాలుగు రోజులుగా ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఇంకా ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే ఆ చిన్నారికి ఆహారమా అందించారు. శిధిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 91 గంటలపాటు శిధిలాల కింద ఉండి ఆకలిదప్పికలను తట్టుకొని మృత్యుంజయురాలిగా నిలిచింది ఆ చిన్నారి. బయటకు తీసిన తర్వాత ఆ చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వార్త తెలిసిన్స్ తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
previous post
next post