telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

జ్వాల గుత్తా అకాడమీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

KTR

మొయినాబాద్ లోని సుజాత స్కూల్ లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఏక్సిలెన్స్ ని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్,  స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కేపసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్,  క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగ సెంటర్ లను ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా జ్వాల గుత్తా మాట్లాడుతూ… అకాడమీ కళ నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలంపియన్ లను తయారు చేయడమే నా లక్ష్యం. జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఏక్సిలెన్స్ లో బ్యాడ్మింటన్ తో పాటు స్విమ్మింగ్, క్రికెట్ లను ట్రైనింగ్ అందిస్తాం అని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బ్యాడ్మింటన్ లొనే స్టార్ గా ఎదిగిన జ్వాల.. తనలాంటి ప్లేయర్లు తీర్చిద్దిదేందుకు అకాడెమీ స్థాపించడం గర్వకారణం. గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ ని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సతోషించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తాం అని అన్నారు.

ఇక అకాడమీ స్థాపించిన జ్వల గుత్తా కి, తన కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. చైనాలో లాగా భారత్ లోను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తెలంగాణలో పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అనుకుంటున్న. జ్వాల అకాడమీ రన్ చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తది అని కేటీఆర్ తెలిపారు.

Related posts