telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ తో జత కట్టనున్న ఉప్పెన హీరోయిన్…

ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తరువాత చాలా జాగ్రత్తగా తన తదుపరి చిత్రాన్ని ఎంచుకున్నారు. రామ్ తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ సరికొత్త కాంబో సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రపై సినీ వర్గాల్లో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేయనుందని టాక్ నడుస్తోంది. దర్శకుడు లింగు స్వామి తన సినిమాలో కృతిని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే కృతి ఇటీవల తన తొలి సినిమా ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద కాసుల ఉప్పెన తెప్పించారు. తన తొలి చిత్రంతోనే కృతి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నారు. ప్రస్తుతం కృతి నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్‌లో నటిస్తున్నారు. అంతేకాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటితో సుధీర్ బాబు చేయనున్న సినిమాలోనూ కృతి నటించనున్నారు.

Related posts