హీరోయిన్ కంగనా రనౌత్ కంటే సిస్టర్ రంగోలి రనౌత్ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్లో జరిగే సంఘటనలపై వివాదస్పదంగా స్పందిస్తూ ఉంటుంది కంగన సోదరి రంగోలి. ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వాళ్లకు నచ్చిన వాళ్లకే ఇచ్చుకుంటారు అంటూ కాస్త ఘాటుగా అప్పట్లో స్పందించింది. మరోవైపు దర్శకులు మహేష్ భట్, కరణ్ జోహార్ ల తీరుపై తనదైన శైలిలో వారిని ఉతికి ఆరేసింది. అంతకు ముందు హృతిక్ రోషన్ చెల్లెలు తనను మోసం చేసింది అంటూ ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఏమైందో ఏమో ఇపుడు ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్.. కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. ట్విట్టర్ వాళ్లు రంగోలి అకౌంట్‌ను ఎందుకు సస్పెండ్ చేసిందో సరైన వివరణ ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా ముందు వెనక చూసుకోకుండా తప్పుడు వార్తలను పోస్ట్ చేసినా వాళ్ల అకౌంట్స్‌ను సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
previous post
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు