telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు…

ఆంధ్రప్రదేశ్, విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు చోట్ల 2వేల 800 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు..పాడేరు సినిమా హాలు సెంటర్ వద్ద తౌడు లోడు మాటున తరలిస్తున్న రెండు వేల కేజీల గంజాయి పట్టుకోగా నిందితులు పరారయ్యారు. మరో కేసులో హుకుంపేట మండలం కామయ్య పేట వద్ద ఐచర్ వ్యాన్ లో తరలిస్తున్న ఎనిమిది వందల కేజీల తో ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీస్ లు. విశాఖ పాడేరు లో ముందస్తు సమాచారం మేరకు ఎస్సై శ్రీనివాస్  సిబ్బంది సినిమాహాలు సెంటర్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి ఐచర్ వ్యాన్ వదిలి కొంత మంది వ్యక్తులు పరారీ అయ్యారు. దీనితో వ్యాన్ తనిఖీ చేయగా అందులో తోడు లోడు మాటున 2000 కేజీల గంజాయి లభ్యం అయ్యింది వ్యాన్ సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు..పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరొక కేసులో 840 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు హుకుంపేట పోలీసులు.. పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్సై నజీర్ సిబ్బంది కలిసి కామయ్యపేట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అటువైపుగా వస్తున్న ఐచర్ వ్యాన్ లో 840 కేజీల గంజాయితో ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

Related posts