telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

జియో నిర్ణయంతో టెలికాం సంస్థల రింగ్ రగడ.. ఇకపై కాల్స్ రింగింగ్ 25 సెకన్లే!

airtel and vodafone got penalty of 3050 cr on jio

ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లయిన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ల మధ్య రింగ్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. టెలికాం రంగంలో జియో తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర రింగ్ అవుతాయి. అయితే ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణం జియోనే అని తెలుస్తోంది. ఇటీవలే జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ 5 సెకన్లు పెంచి.. ఆ సమయాన్ని 25 సెకన్లు చేసింది.

దీంతో జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ సమయాన్ని 25 సెకన్లకు కుదించాయి. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్స్ రింగింగ్ సమయాన్ని పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయి. కాగా జియో ఐయూసీ చార్జిలను ఎక్కువగా చెల్లిస్తున్నందువల్లే ఆ ఖర్చును తగ్గించుకోవడానికి రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపిస్తున్నాయి.

Related posts