telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డబ్బుతో గెలిచామనడం సరికాదు: కేటీఆర్

ktr trs president

తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 92 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, బీజేపీలకు 1200 వార్డుల్లో అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు తమ ఓటమికి కారణాలు వెతుక్కోకుండా గెలిచిన టీఆర్ఎస్ పై అనైతిక ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుతో గెలిచామనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్‌, లక్ష్మణ్‌ అవమానిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు ఈవీఎంలే కారణమని లొల్లి చేశారు, మరి, ఇప్పుడు జరిగిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్‌కు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయిందని అన్నారు.

Related posts