telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకే ర్యాంకులను ఎస్‌ఎంఎస్‌గా పంపించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పినిశెటి రవితేజ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, వేద ప్రణవ్‌కు సెకండ్‌ ర్యాంక్‌ వచ్చింది. ఇంజినీరింగ్‌లో మొత్తం 74.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మెడికల్‌ విభాగంలో వెంకటసాయి స్వాతి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (84శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Related posts