భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెబుతోంది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది.
వీటి ప్రభావంతో సోమవారం ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రానున్న 24 గంటల్లో కర్నూలు, కడప, తిరుపతి, రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
మరోవైపు..తెలంగాణలలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
కాగా..దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరువకాగా.. ప్రజలు చుక్కలు చూశారు. ఇప్పుడు నైరుతు రుతుపవనాల ముందస్తు రాక, వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అమరావతిని కూల్చేసేలా సీఎం జగన్ చర్యలు: కేశినేని నాని