telugu navyamedia
సినిమా వార్తలు

రౌడీ హీరో విజయ్‌, సామ్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌..

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ , సమంత జంటగా ఓ సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ 11వ చిత్రమిది. ఈ రోజు సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమాకు ‘ఖుషి’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

Image

ఇందులో విజయ్‌ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ‘ఖుషి’ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.

”సంతోషం, నవ్వులు, ప్రేమ, కుటుంబ అనుబంధాలు మేళవింపుగా ‘ఖుషి’ రూపొందుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ కు ఆనందాన్ని పంచుదాం” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

Related posts