telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవకాశం కోసం వెళితే బట్టలు విప్పమన్నాడు : హీరోయిన్

malhar

మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి `మీటూ` ఉద్యమం వెలుగులోకి వచ్చింది. వెండితెర నుంచి బుల్లితెర వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది వేధింపులు ఎదుర్కున్న వారే. ఈ ఉద్యమంలో భాగంగా చాలా మంది మహిళలు గతంలో తమను వేధించిన సినీ ప్రముఖల పేర్లను బయటపెట్టారు. తాజాగా హీరోయిన్ మల్హార్ రాథోడ్ కూడా గతంలో తానెదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఉదంతం గురించి మాట్లాడుతూ .. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఓ సీరియల్‌లో అవకాశం ఇస్తానని ఓ నిర్మాత చెప్పాడు. ఆడిషన్ కోసం రమ్మన్నాడు. అతని వయసు 65 ఏళ్లు. ఆడిషన్ కోసమని అతని రూమ్‌లోకి వెళితే.. `టాప్ తీసెయ్.. నేను చూడాలి` అన్నాడు. నేను షాకయ్యాను. అక్కణ్నుంచి వెంటనే బయటకు వచ్చేశాన`ని మల్హార్ తెలిపింది. టీవీ రంగంలో కూడా చాలా మంది లైంగిక వేధింపులకు పాల్పడతారని, లొంగకపోతే కెరీర్‌పై దెబ్బకొడతారని మల్హార్ వెల్లడించింది.

Related posts