కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీన అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మరోవైపు.. ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఇదిలావుంటే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు జరిపారు.
ఆత్మహత్య అనంతరం పోలీసుల సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఓ కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు పూర్తైన తర్వాత.. కోడెల కుమారుడు శివరాంను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి