telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎంను క్ష‌మాప‌ణ‌లు కోరిన ఉద్యోగులు ..

ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మంత్రుల కమిటీతో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చ‌ల్లో భాగంగా తమ డిమాండ్లు నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కాబట్టి, సమ్మెను విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి నాయకులు తెలిపారు

తమకు జరిగిన అన్యాయం గురించి సానుకూలంగా చర్చించామన్నారు. మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి సవివరంగా చర్చించామన్నారు. సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. 

ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారని చెప్పారు. తమ చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వెల్లడించారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. సీఎంను కలిసి కృతజ్ఞతలు చెబుతాం.

AP employees threaten strike, notice to be given to CS on Jan. 21

ఉద్యోగులపై అభిమానాన్ని సీఎం మరోసారి చాటుకున్నారని సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సచివాలయంలో పని చేసే ఉద్యోగులందరికీ 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ తర్వాత కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పడం ఆనందంగా ఉందని చెప్పారు.

సానుకూల నిర్ణయం వచ్చింది కాబట్టి సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు. పీఆర్సీ నివేదిక ఇస్తామని చెప్పడం సంతోషం కలిగించిందని మరో నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అన్ని సమస్యలు ముగిశాయని చెప్పడం లేదని.. కానీ, పరిష్కారంలో ఇది ఒక మంచి ఆరంభమని తెలిపారు. మొదలైన రోజే అన్నీ పూర్తి చేసుకోలేమని వివరించారు.

కాగా.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో విభేదించారు. ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్‌బాబు మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారు మా ఐకాసలో సభ్యులే కాబట్టి.. వారితో చర్చించి ఆదివారం ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి తీసుకెళ్తామని చెప్పారు.

ఆదివారం పీఆర్‌సీ సాధన సమితి నాయకులు అంతా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతామని అన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో తమ సమస్యలను అర్థం చేసుకుందని కొందరు పీఆర్సీ సాధన సమితి నాయకులు చెప్పారు.

Related posts