telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆషాడంలో ఆడపిల్ల చేతికి గోరింటాకు… ఎందుకంటే ?

Mehendi

ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా ? మన వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ, ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే.. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడుతారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక.. అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి.. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకుని చేతులకి రాయాలి. ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్‌లో వస్తుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరక్కపోవచ్చు. అలాంటి వారు గోరింటాకుకి బదులుగా మెహందీనికి కూడా పెట్టుకోవచ్చు. దీని వల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి. అంతే కాకుండా. దీనితో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు. అయితే, మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీదీ అయి ఉండాలి. తాజాది పెట్టుకోవాలి. అలా కాకుండా నాసిరకంవి పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Related posts