telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కిడ్నాప్‌ కేసులో తెర మీదకు ఏవీ సుబ్బారెడ్డి పేరు…

av subbareddy akhilapriya

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ పై సీపీ అంజనీకుమార్ ప్రెస్ మీట్ తో తెర మీదకు ఏవీ సుబ్బారెడ్డి పేరు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు.మొత్తం కుట్రలో అఖిల ప్రియతో ఏవీ సుబ్బా రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాధితుల వాగ్మూలం ప్రకారం ఈ కేసులో A1 గా ఏవీ సుబ్భా రెడ్డి ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డికి సరైన సంబంధాలు లేవు. కానీ అనూహ్యంగా A1 గా ఏవీ సుబ్బా రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. అయితే హఫీజ్‌ పేట్‌ భూ వ్యవహారమంతా నాకు తెలుసు. కేసు విచారణ దశలో ఉండగా మాట్లాడటం కరెక్ట్‌ కాదు అని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ పాత్రపై అన్ని వివరాలు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆధారాలతో బయటపెడతా… అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ వ్యవహారశైలిపై గతంలో హెచ్చరించా అని తెలిపారు. హఫీజ్‌పేట్‌ భూ వ్యవహారంపై పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  వైద్యపరీక్షల ఆమెను సికింద్రాబాద్ లోని కోర్టులో హాజరుపరచనున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించబోతున్నారు. అలాగే ఈ కేసులో కీలక నిందితులుగా చెప్తున్న భార్గవ్, చంద్రహాస్ లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Related posts