telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు

పూజ చేస్తూ.. కొండపై నుంచి జారిపడి మరణించిన పూజారి

అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో భక్తులు కొండపైకి భారీగా చేరుకున్నారు. ప్రతి శనివారం ఇలాగే భక్తులు వస్తూ ఉంటారు. ఆ పూజారి స్వామికి పూజ చేస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు.. ప్రతి రోజూలాగే.. ఆ పూజరి పూజ చేస్తూ హరతి ఇచ్చే క్రమంలో గంట కొడుతూ, హరతి చూపిస్తూ కొండపై నుంచి జారి కింద ఉన్న లోయలోకి పడ్డాడు. అప్పటి వరకు గోవిందా గోవింద అన్న భక్తుల స్వరం మారింది. స్వామి స్వామి.. అయ్యో ఏమైంది అంటూ రోధన మొదలైంది. అందరూ చూస్తుండగానే.. ప్రమాదం జరిగింది.

దాదాపు 100 అడుగుల లోతులో పడిపోవటంతో రాతి దెబ్బలు తగిలి పూజారి మరణించారు. కొండపైన స్వామికి హారతి చూపించి, కింద ఉన్న గుహలోని దేవుడి వద్దకు వెళ్ళి హారతి చూపించేందుకు దిగుతూ ఉండగా ఈదుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు కొండపైన స్వామివారికి భక్తులు సమర్పించిన నూనె ఉండటంతో కాలు జారి పూజారి మృతి చెందినట్లు కొందరు చెపుతున్నారు. కిందపడిన పూజారికి కొందరు మంచినీళ్లు ఇచ్చి రక్షించే ప్రయత్నం చేసినప్పటీకీ ఆయన మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమచారం తెలుసుకున్న స్ధానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఘటనాస్ధలానికి బయలు దేరారు.

Related posts