telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో దారుణం… సొంత అన్న, అక్కను దారుణంగా హత్య చేసి..!

ఆస్తి గొడవలు రక్త సంబంధికుల మధ్యనే చిచ్చు పెడుతున్నాయి. ఆస్తుల కోసం ఒకే కడుపున పుట్టిన వాళ్లనే చంపేస్తున్నారు. అవును ఇలాంటి ఘటనలు ఈ మధ్యలో విపరీతంగా పెరిగిపోయాయి. అమ్మ, నాన్నలపై ప్రేమ కంటే ఆస్తిపైనే మోజు ఎక్కువైంది. సరిగ్గా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్నాయి. సొంత అన్న, అక్కను నరికి చంపాడో వ్యక్తి. కొవ్వాడలోని రామచంద్రాపురం గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం… ఇచ్చిన నష్టపరిహారం విషయంలో అన్నదముళ్లైన…. గొర్లె సన్యాసిరావు, రామకృష్ణ మధ్య వివాదం చెలరేగింది. మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. పట్టలేని ఆగ్రహంతో తమ్ముడు రమకృష్ణ… అన్నను కత్తితో పొడిచి చంపాడు. అడ్డువచ్చిన అక్క జయమ్మను కూడా హతమార్చాడు.

Related posts