telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ లోని థియేటర్ యాజ‌మాన్యుల‌కు ఊర‌ట‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సీజ్ చేసిన థియేటర్లను మ‌ళ్ళీ తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే నెల రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను అమలు చేయాలని కండిషన్స్ పెట్టింది.

ఏపీ రాష్ట్రంలోని జీవో నెంబర్ 35 రూల్స్ ఫాలో అవ్వడం లేదు అంటూ..తొమ్మిది జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి దాదాపు 83 థియేటర్లకు సీల్ వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లు వర్కవుట్  కావడం లేదు అని థియేటర్ యాజమాన్యం, డిస్టిబ్యూటర్స్ బోర్డులు పెట్టారు.

తాజాగా ఇప్పటికే సీజ్ చేసిన థియేటర్లతో పాటు మూతపడిన వాటిని తిరిగి ఓపెన్ చేసేందుకు జగన్ సర్కార్ అవకాశం కల్పించింది. అన్ని థియేటర్ల యాజమాన్యాలకు మరో నెలరోజులు గడువు ఇస్తున్నామని… అప్పటివరకు ప్రభుత్వ నిబంధనలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

థియేటర్‌ తెరవాలి అనుకునే వాళ్లు జిల్లా కలెక్టర్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని ..అలాగే ఇప్పటి వరకూ ఉన్న పెనాల్టీలు కట్టి  థియేటర్లు తెరుచుకోవచ్చని,  లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. 

దీంతో టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై సినిమా థియేటర్ల యజమాన్యులకు కాస్త ఊరట లభించింద‌నే చెప్పొచ్చు.

Related posts