ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.76 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 986703 కు చేరింది. ఇందులో 918985 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 60208 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 38 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7510 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,359 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 39,619 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
previous post
దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు చేపట్టాలి: కోదండరాం