telugu navyamedia
క్రైమ్ వార్తలు

జయరామ్ హత్య కేసు కీలక మలుపు..ఏసీపీపై బిగుస్తున్న ఉచ్చు!

Chigurupati Jayarammuder case
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డినే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయరామ్‌ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్‌రెడ్డికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సహకరించినట్లు తేలింది. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మల్లారెడ్డి వ్యవహారశైలిపై అధికారులు ఆగ్రహం వేస్తూ బదిలీ వేటు వేశారు. మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇంఛార్జ్‌ ఏసీపీగా గాంధీనారాయణను నియమించారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ కమిషనర్‌ బదిలీ చేశారు. గతంలోనూ భూకబ్జా కేసులో రాకేష్‌రెడ్డికి ఏసీపీ మల్లారెడ్డి సహకరించినట్లు సమాచారం.

Related posts