వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల పాపను హత్యాచారం చేయడంపై ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నిందితుడిని ఉరితీయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంకర్ రష్మి సోషల్ మీడియా ఖాతాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెలల పాప ఏం బట్టలు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు