telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇక కర్ణాటకలో గోవధ నిషేధం…

yedyurappa cm karnataka

కర్నాటక ప్రభుత్వం గోవధ నిషేధ ఆర్డినెన్సును తీసుకువచ్చింది. గోవధ నిషేధ చట్టం తీసుకురావడానికి కర్నాటక ప్రభుత్వం ప్రయత్నించగా కౌన్సిల్ లో ఆ బిల్లు వీగిపోయింది. దాంతో చట్టం రూపొందించే ప్రక్రియ పూర్తికాలేదు. ఈ కారణంగా ఆర్డినెన్సును జారీ చేసింది.ఈ ఆర్డినెన్సు ప్రకారం కర్నాటక రాష్ట్రంలో గోవులను, వాటి దూడలను సంహరించడం నేరం కిందికి వస్తుంది. 13 సంవత్సరాలు దాటిన ఎద్దులను మాత్రం మాంసం కోసం వినియోగించవచ్చు. చాలా రాష్ట్రాలలో గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నది.అయితే వాటిలో గేదెలను మినహాయించారు. అయితే కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గేదెలను కూడా ఇందులో చేర్చి గోవధ నిషేధ చట్టానికి మరింత విస్త్రృతి కల్పించారు. పశువులను కర్నాటక రాష్ట్రంలోగానీ, కర్నాటక నుంచి ఇతర ప్రాంతాలకు గానీ వధించడం కోసం తరలించడాన్ని పూర్తిగా నిషేధించారు.ఏ వ్యక్తి కానీ తెలిసి కానీ తెలియక కానీ పశువులను వధ శాలకు తరలించడం నేరం. సబ్ ఇన్ స్పెక్టర్ ర్యాంకుకు ఎక్కువ ఉన్న అందరు పోలీసు అధికారులు పశువులను వధించేందుకు తీసుకువెళుతున్నారని గానీ, వధించేందుకు పశువులను బంధించారని గానీ సమాచారం అందుకుంటే ఏ ప్రాంగణాన్ని అయినా వారు తనిఖీ చేసే అధికారాలను కూడా దఖలు పరిచారు. ఈ విధంగా చట్టవిరుద్ధగా వధ శాలకు తరలించే పశువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వ పశు సంరక్షణ శాలలకు తరలిస్తుంది.

Related posts