టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ డ్రైవర్ నాగరాజు(28)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..
శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగరాజును కుప్పం పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీపు రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు.
రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు .నాగరాజు ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.